ETV Bharat / bharat

మహిళపై సామూహిక అత్యాచారం-నలుగురి అరెస్ట్​ - miner rape in amethi

యూపీలో మరో రెండు అత్యచార ఉదంతాలు వెలుగు చూశాయి. చిత్రకూట్​ జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరగ్గా... మరొకటి 11 ఏళ్ల బాలికపై అమేఠీలో జరిగింది.

Several arrested in a series of rape incidents in UP
మహిళపై సాముహిక అత్యాచారం-నలుగురి అరెస్ట్​
author img

By

Published : Oct 20, 2020, 4:04 PM IST

Updated : Oct 20, 2020, 4:17 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని చిత్రకూట్​లో 35 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగిన ఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వారిలో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందులో ఇద్దరికి అత్యాచారంతో సంబంధం ఉండగా.. మరో ముగ్గురు సహకరించినట్లు వెల్లడించారు.

కార్వీ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓ నిందితుడి ఇంట్లో సెప్టెంబర్​ 28న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

అమేఠీలో మరో ఘటన...

ట్యూషన్​కు వెళ్లి వస్తున్న 11ఏళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టారు. వీరిలో బాధితురాలి బంధువు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణం అమేఠీలోని ముసఫర్​ఖాన కోత్వాలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

ఇదీ చూడండి: హన్సీ ప్రహారికి అండగా కదిలిన ఉత్తరాఖండ్​ యంత్రాగం

Last Updated : Oct 20, 2020, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.