ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొత్తగా 17,066 మందికి పాజిటివ్​

భారత్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దేశంలో ఎక్కువ కేసులు గల రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో 17,066 మంది వైరస్​ బారిన పడ్డారు.

author img

By

Published : Sep 14, 2020, 7:22 PM IST

Updated : Sep 14, 2020, 9:41 PM IST

Seven more die of COVID-19 in Rajasthan, toll reaches 1,243
తమిళనాట మరో 5,752 మందికి కరోనా

దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 17,066 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 257 మంది మరణించగా.. 15,786 మంది డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 10,77,374 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 7,55,850 మంది కోలుకున్నారు.

  • కర్ణాటకలో తాజాగా 8,244 కేసులు వెలుగు చూశాయి.. మరో 119 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 4,67,689 మంది బాధితులు ఉండగా.. అందులో 3,61,823 మంది కోలుకున్నారు.
  • తమిళనాట రోజూ సగటున 5 వేల కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మరో 5,752 మందికి పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజులో 53 మంది మృతి చెందగా.. 5,799 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 5,08,511 మంది బాధితులు ఉండగా.. 8,434 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 5,208 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3,17,195కు చేరింది. 67,287 యాక్టివ్​ కేసులు ఉండగా.. 2,45,417 మంది కోలుకున్నారు.
  • దిల్లీలో తాజాగా 3,229 కేసులను గుర్తించారు. దీంతో మొత్తం 2.21 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. మరో 26 మంది మృతి చెందగా...ఇప్పటివరకు 4,770 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు.
  • దిల్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు పాజిటివ్​గా తేలింది. వీరితో పాటు మరో ముగ్గురు అసెంబ్లీ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.
  • ఒడిశాలో తాజాగా 4,198 మందికి పాజిటివ్​గా తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1.55 లక్షలు దాటింది. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 637కు చేరింది.
  • కేరళలో కొత్తగా 2,110 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 30,486 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 79,813 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • రాజస్థాన్​లో మరో 731 మంది వైరస్ బారిన పడగా.. ఏడుగురు మృతి చెందారు.
  • త్రిపురలో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 19,187కు చేరింది.
  • పుదుచ్చేరిలో తాజాగా 414 కేసులు బయటపడగా... మొత్తం 20 వేలకు పైగా బాధితులు ఉన్నారు. ఇప్పటివరకు 394 మంది మృతి చెందారు.

Last Updated : Sep 14, 2020, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.