ETV Bharat / bharat

ఒకే రోజు 'ఏడు' బాల్య వివాహాలకు చెక్​ - 7 child marriages in chamrajnagar

కర్ణాటకలో ఆడపిల్లలను గుండెలపై కుంపటిలా భావించిన కొందరు తల్లిదండ్రులు.. ఆ బరువు దించేసుకోవాలి అనుకున్నారు. అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా పెళ్లికి సిద్ధమవ్వకముందే... ముకుతాడు వేసి అత్తారింటికి పంపించాలనుకున్నారు. ముహూర్తాలూ పెట్టేశారు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు ఈ బాల్య వివాహాలను ఆపేశారు.

Seven Child Marriages held in a single Day: DWCD Succeed in Cancelling of All the Marriages
ఒకే రోజు ఏడు బాల్య వివాహాలకు ముహుర్తం!
author img

By

Published : Jun 15, 2020, 4:44 PM IST

Updated : Jun 15, 2020, 8:24 PM IST

మగువలు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఆరితేరుతున్న ఈ కాలంలోనూ.. పెళ్లి పేరిట వారి కలలను మొగ్గలోనే తుంచేస్తున్నారు తల్లిదండ్రులు. పెళ్లీడుకు రాని బాలబాలికలకు వివాహం చేయడం నేరమని తెలిసినా.. కర్ణాటక చామరాజ్​నగర్​లో ఒకే రోజు ఏడుగురు బాలికలకు పెళ్లి ముహుర్తాలు పెట్టేశారు. అయితే, సమాచారం అందుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆ పెళ్లిళ్లు జరగకుండా అడ్డుకోగలిగారు.

Seven Child Marriages held in a single Day: DWCD Succeed in Cancelling of All the Marriages
ఒకే రోజు ఏడు బాల్య వివాహాలకు ముహుర్తం!

ఇందిగంట గ్రామంలో 15 ఏళ్ల బాలికకు వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం రాగానే, ముహుర్త సమయానికి కొద్ది గంటల ముందు ఆ ఇంటికి చేరుకుని, పెళ్లి ఆపేశారు అధికారులు. అరకలవాడిలో 16 ఏళ్ల అమ్మాయి, వై.కే.మోలే గ్రామంలో 14 ఏళ్ల బాలికనూ ఇలాగే కాపాడారు. అమచావడి, శెట్టితల్లి గ్రామాల్లోనూ బాల్య వివాహాలను అడ్డుకున్నారు.

బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలుపై తల్లిదండ్రులకు.. అవగాహన కల్పించారు. మే నెలలోనూ 18 బాల్య వివాహాలను అడ్డుకున్నారు మహిళా శిశు సంక్షేమ అధికారులు.

ఇదీ చదవండి: గజరాజులపై ఆగని దాడులు.. మరో రెండు బలి

Last Updated : Jun 15, 2020, 8:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.