దేశంలో ఇప్పటివరకు అధిక శాతం కరోనా కేసులు సెప్టెంబర్లోనే నమోదయ్యాయి. భారత్లో మొత్తం 63 లక్షల మందికి వైరస్ సోకగా.. సెప్టెంబర్లో 26.21 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం కేసుల్లో ఇది 41.53 శాతం.
మరణాలు కూడా సెప్టెంబర్లోనే అధికంగా సంభవించాయి. దేశంలో ఇప్పటివరకు 98,678 మంది మరణించగా.. సెప్టెంబర్లో 33,390 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్యలో 33.84 శాతం.
వ్యాప్తి ఇలా..
దేశంలో లక్ష కేసుల మార్కు చేరుకునేందుకు 110 రోజులు పట్టింది. మరో 59 రోజుల్లో 10 లక్షలకు చేరింది. 20 లక్షలకు 21 రోజులు, 30 లక్షలకు 16 రోజులు.. అరవై లక్షలకు చేరుకునేందుకు మరో 36 రోజులు పట్టింది.
రికవరీల్లో తొలి స్థానం...
కేసుల సంఖ్య పరంగా రెండో స్థానంలో ఉన్న భారత్... రికవరీల విషయంలో తొలి స్థానంలో ఉంది. ఆదివారం 85 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం సంఖ్య రికవరీల సంఖ్య 52.73 లక్షలుగా ఉంది.
క్రియాశీల కేసుల సంఖ్య కూడా వరుసగా పదో రోజూ 10 లక్షలకు దిగువన ఉంది.
ఇదీ చూడండి: వైరస్ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్' విలువ