ETV Bharat / bharat

'నిషేధంపై విదేశీ తబ్లీగీలకు వ్యక్తిగత ఉత్తర్వులు పంపాం' - visa cancellation of 2,500 Tablighi members

తబ్లీగీ జమాత్​ కార్యకలాపాల్లో పాల్గొన్న 2,500 మందికిపైగా విదేశీయుల వీసాల రద్దు, 10 ఏళ్లపాటు నిషేధంపై వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. క్రిమినల్​ అభియోగాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతున్నందున ఎవరూ స్వదేశానికి వెళ్లలేదని వెల్లడించింది.

Separate order passed on blacklisting
వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేశాం
author img

By

Published : Jul 2, 2020, 4:03 PM IST

2,500 మందికిపైగా విదేశీ తబ్లీగీలను 10 ఏళ్లపాటు భారత్​లోకి రాకుండా నిషేధించటం, వీసాల రద్దుపై సుప్రీం కోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది కేంద్రం. నిబంధనలను ఉల్లంఘించి తబ్లీగీ జమాత్​ కార్యకలాపాల్లో పాల్గొన్న కారణంగా వీసాల రద్దు, బ్లాక్​లిస్ట్​లో చేర్చటంపై వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది.

విదేశీయుల నిషేధంపై దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్​ ఏ ఎం ఖాన్​విల్కర్​, జస్టిస్​ దినేశ్​ మహేశ్వరీ, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాల ధర్మాసనం విచారణ చేపట్టింది. వీసాల స్థితిపై తమ వైఖరి తెలపాలని జూన్​ 29న కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు వివరాలు అందించింది కేంద్రం.

ఈ సందర్భంగా.. 1,906 మందికి లుక్ అవుట్​ నోటీసులు (ఎల్​ఓసీ)​ జారీ చేసినట్లు కోర్టుకు తెలిపింది కేంద్రం. ఎల్​ఓసీ జారీ లేదా బ్లాక్​లిస్ట్​లో చేర్చకముందే 227 మంది దేశం విడిచి వెళ్లారని స్పష్టం చేసింది. విదేశీయులను బ్లాక్​లిస్ట్​లో చేర్చటం ఒక్కటే కాదని, వారిపై క్రిమినల్​ అభియోగాలు ఉన్నట్లు కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా ధర్మాసనానికి వివరించారు. విదేశీయుల చట్టం కింద విచారణ జరుపుతున్న కారణంగా ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్వదేశానికి వెళ్లలేదని వెల్లడించారు.

అయితే.. కేంద్రం వాదనలను తోసిపుచ్చుతూ తమకు వీసాల రద్దు విషయంలో కేవలం 1,500ల ఒకే లైన్​ ఈ-మేయిల్స్​ అందాయని, బ్లాక్​లిస్ట్​లో చేర్చుతున్నట్లు ఎలాంటి షోకాజ్​ నోటీసులూ అందలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. వారిని స్వదేశానికి పంపించేయాలన్నారు పిటిషనర్ల తరఫు న్యాయవాది సీ యూ సింగ్​.

కేంద్ర ప్రభుత్వ వాదనలపై పూర్తిస్థాయి అధికారిక సమాచారంతో కౌంటర్​ అఫిడవిట్​ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది ధర్మాసనం. వ్యక్తిగత ఆదేశాలపై హైకోర్టుల్లో అప్పీలు చేసుకోవచ్చని సూచించింది. అవి సరైన ఉత్తర్వులేనా లేదా అనేది కోర్టు తేల్చుతుందని స్పష్టం చేసింది.

ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జులై 10కి వాయిదా వేసింది.

కేంద్రం అందించిన సమాచారం ప్రకారం.. 11 దేశాలకు చెందిన తబ్లీగీ జమాత్​ సభ్యులపై 205 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. 2,765 మంది విదేశీయులను బ్లాక్​లిస్ట్​లో పెట్టారు. 2,679 విదేశీయుల ( 9 మంది ఓవర్​సిస్​ సిటిజన్​ ఆఫ్​ ఇండియా కార్డుదారులుతో కలిపి) వీసాలు రద్దు చేశారు.

ఇదీ చూడండి: 'తబ్లీగీలను నిషేధించడంపై కేంద్రం వైఖరేంటి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.