సీనియర్ టెలివిజన్ జర్నలిస్ట్ నిధి రాజ్దాన్.. కేటుగాళ్ల ఫిషింగ్ దాడితో మోసపోయినట్లు తెలిపారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికైనట్లు సమాచారం అందించి తనను మోసం చేశారని పేర్కొన్నారు. ఇది తప్పని తెలుసుకుని భావోద్వేగానికి గురైనట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా తెలిపారు.
హార్వర్డ్‌లో ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చిన మాట అవాస్తవమని స్పష్టం చేసిన రాజ్దాన్ కొందరు కేటుగాళ్లు తనని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
I have been the victim of a very serious phishing attack. I’m putting this statement out to set the record straight about what I’ve been through. I will not be addressing this issue any further on social media. pic.twitter.com/bttnnlLjuh
— Nidhi Razdan (@Nidhi) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I have been the victim of a very serious phishing attack. I’m putting this statement out to set the record straight about what I’ve been through. I will not be addressing this issue any further on social media. pic.twitter.com/bttnnlLjuh
— Nidhi Razdan (@Nidhi) January 15, 2021I have been the victim of a very serious phishing attack. I’m putting this statement out to set the record straight about what I’ve been through. I will not be addressing this issue any further on social media. pic.twitter.com/bttnnlLjuh
— Nidhi Razdan (@Nidhi) January 15, 2021
ఇదీ జరిగింది...
న్యూస్ ఛానల్ ఎన్డీటీవీలో 21 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు నిధి రాజ్దాన్. కొన్ని రోజుల క్రితం... హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరాలంటూ ఆమెకు ఓ ఉత్తరం అందింది. ఈ నేపథ్యంలో నిధి ఎన్డీటీవీలో ఉద్యోగం మానేశారు.
సెప్టెంబర్ 2020 కల్లా ఉద్యోగంలో చేరాలని తొలుత నిధికి సమాచారం అందింది. దీంతో ప్రొఫెసర్‌గా చేరేందుకు ఒప్పుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తర్వాత హార్వర్డ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. కొన్ని రోజుల తర్వాత నిధి స్వయంగా ఓ సీనియర్ ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు సైబర్ నేరగాళ్లు తన వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఈ మోసానికి పాల్పడ్డారని భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై చర్య తీసుకువాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాలని హార్వర్డ్‌కు కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:జాగ్తే రహో: ఆశ చూపించి డబ్బులు కొట్టేస్తారు!