ETV Bharat / bharat

డిసెంబర్​ 1న ముఖ్యమంత్రిగా ఠాక్రే ప్రమాణ స్వీకారం - maharastra politics

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సిద్ధమవుతున్నాయి. వీరి కూటమికి మహా వికాస్ అఘాడీగా నామకరణం చేసి.. నాయకుడిగా సేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను ఎన్నుకున్నారు. డిసెంబర్​ 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజును కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు.

MH-UDDHAV-CM
MH-UDDHAV-CM
author img

By

Published : Nov 26, 2019, 8:37 PM IST

Updated : Nov 26, 2019, 8:45 PM IST

ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామాతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన సమాయత్తమవుతున్నాయి. మూడు పార్టీల కూటమికి మహా వికాస్‌ అఘాఢీగా నామకరణం చేశారు.

ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటు, విధి విధానాలపై ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ కూటమి నాయకుడిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేను 3 పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ముఖ్యమంత్రిగా..

ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఠాక్రేకే మొగ్గు చూపారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే డిసెంబర్‌ 1న ప్రమాణం చేయనున్నారని మరాఠా యోధుడు శరద్​ పవార్ ప్రకటించారు. ముంబయిలోని శివాజీ పార్క్‌ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం కుర్చీలో కూర్చొనే ఘనత ఉద్ధవ్​దే కానుంది.

కలలో కూడా ఊహించలేదు..

ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంపై ఉద్ధవ్​ ఠాక్రే సంతోషం వ్యక్తం చేశారు. ఫడణవీస్ చేసిన ప్రతి ఆరోపణకూ సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

"రాష్ట్రాన్ని పాలిస్తానని కలలో కూడా ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు. మీరందరూ నాపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తా. ఛత్రపతి శివాజీ కోరుకున్న మహారాష్ట్రను పునర్నిర్మిద్దాం. ఫడణవీస్​ లేవనెత్తిన ప్రశ్నలంటికీ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. నేను దేనికీ భయపడట్లేదు."

-ఉద్ధవ్​ ఠాక్రే, శివసేన అధినేత

ఈ సమావేశం నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ట్రైడెంట్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నారు. శరద్​ పవార్​ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. ఇదీ చూడండి: పార్లమెంట్ సంయుక్త సమావేశం బహిష్కరించిన విపక్షాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Thumane, near Durres - 26 November 2019
1. Various aerials of damaged buildings, with excavators and rescue teams searching for survivors ++DRONE SHOTS/MUTE++
2. Search and rescue team near debris and rubble
3. Onlookers standing near excavator
4. Rescue team rushing to take an injured on stretcher away
5. Wide of rescuers
STORYLINE:
Albania's Defense Ministry has reported two more dead in the western port city of Durres following an early morning earthquake, taking the confirmed death toll to 16.
The worst-hit areas were Durres and the northern town of Thumane.
Drone pictures from Thumane showed the scale of the damage.
Rescue teams from neighboring Kosovo and Montenegro, as well as from Italy, have already arrived, while a convoy of trucks has entered the country from Greece.
They are slowly working trying to find survivors in the rubble of the collapsed buildings.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 26, 2019, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.