చెన్నై విమానాశ్రయంలో దాదాపు రూ.2.45 కోట్లు విలువచేసే 24.5 కిలోల మాదక ద్రవ్యాల్ని.. ఎయిర్పోర్ట్ కార్గో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్‌ను.. ఓ కార్గో విమానంలో స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తమకు సమాచారం అందిందని అన్నారు.





తనిఖీలు చేయగా కొబ్బరికాయలలో డ్రగ్స్ దొరికినట్లు వెల్లడించారు. వాటిని సీజ్ చేశామన్నారు. డ్రగ్స్ ఎగుమతి చేస్తోన్న 43 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: జాతీయ జెండా కప్పినందుకు ఎఫ్ఐఆర్