ETV Bharat / bharat

సీపోతి.. మా ఇంటికొచ్చి దీవించిపో తల్లీ! - మలయాళ

గడ్డు కాలం నుంచి తమను కాపాడమని కోరుతూ సీపోతిని స్వాగతిస్తున్నారు ఉత్తర కేరళ వాసులు. ఓ వైపు సీపోతి అందంగా సింగారించుకుని వీధుల్లో సందడిగా సాగుతుంటే.. మరో వైపు పాటలు పాడుతూ ఉత్సాహాన్ని పంచుతున్నాడు తెయ్యం గాయకుడు. ఏటా జరిగే సీపోతి తెయ్యం ఈ సారి మరింత ఆనందంగా సాగుతుంది.

సీపోతి.. మా ఇంటికొచ్చి దీవించిపో తల్లీ!
author img

By

Published : Aug 20, 2019, 5:02 AM IST

Updated : Sep 27, 2019, 2:43 PM IST

సీపోతి.. మా ఇంటికొచ్చి దీవించిపో తల్లీ!

ఉత్తర కేరళలో ఏటా కర్కీడకోం అనే మలయాళ మాసంలో జరుపుకునే సీపోతి తెయ్యం ఉత్సవాలు.. ఈ సారీ ఘనంగా జరుగుతున్నాయి.

సీపోతి ఇందుకే..

జులై మధ్యలో ప్రారంభమయ్యే కర్కీడకోం మాసం దాదాపు 30 రోజులు ఉంటుంది. పూర్వం నుంచి ఈ నెలను దుర్భరమైన నెలగా పరిగణిస్తారు. ఈ నెలలో భారీ వర్షాలతో ఈ ప్రాంతమంతా అతలాకుతలంగా మారుతుంది. ఈ కాలంలో వ్యాధులు సోకే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది. ఈ కష్టాలనుంచి కాపాడేందుకు అనేక ఉత్సవాలు జరిపి, తమను క్షేమంగా ఉంచమని దేవదేవతలను వేడుకుంటారు. వాటిలో 'సీపోతి తెయ్యం' ఒకటి.

తల్లీ నీ దీవెన కోరి

ఉత్తర కేరళలోని హిందువులు ఈ సంప్రదాయాన్ని అనాదిగా పాటిస్తున్నారు. సీపోతి వారి ఇలవేల్పు.. ఈ నెలలో ఆమె ఏదో ఒక రూపంలో భక్తులను కనికరిస్తుందని వారి నమ్మకం. కర్కీడకోం నెలలో పొంచి ఉన్న కీడుల నుంచి సురక్షితంగా ఉండేలా దీవించడానికి సీపోతి తెయ్యం వేషధారణలో మలయన్​ కులానికి చెందిన బాలబాలికలు ఇంటి ముందుకొస్తారు.

తెల్ల గౌనుపై, ఎర్రని రవిక, బంగారపు వర్ణంలోని నగలు, చిన్న కిరీటం, సంప్రదాయ గొడుగు ధరించి నిండుగా వీధుల్లో తిరుగుతుంది సీపోతి. కర్కీడకోం తర్వాతి నెల చింగోమ్​ను ఆనందాలతో స్వాగతిస్తుంది.

ఓ అనుభవజ్ఞుడైన జానపద గాయకుడు సీపోతి తెయ్యం వెంట పాటలు పాడుతూ వస్తాడు. కుటుంబ సభ్యులు వారిని ఆహ్వానించి నిలవిలక్కు పేరిట ఓ దీపం పెడతారు.. గురూతి అని పిలిచే సున్నం నీటిని ఆ దీపం చుట్టూ తిప్పి పడేస్తారు. అందులోనే వారి కీడునంతా తరిమికొడ్తారు. ఆ తర్వాత గాయకుడి తుడి సంగీతానికి సీపోతి చేతులాడిస్తూ నాట్యం చేస్తుంది. వారిచ్చే దక్షిణ తీసుకుని ముందుకు సాగిపోతుంది.

"మాకు వచ్చిన దక్షిణలో కొంత భాగం కేరళ వాయినాడ్​లోని వరద బాధితులకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాం. కర్కీడకం మలయాళ క్యాలెండర్​లోని ఓ మాసం. ఉత్తర కేరళలో సీపోతి రాగానే మలయాళ నూతన సంవత్సర ఉత్సవాలు ఆరంభమవుతాయి. "

- అజీష్​ వెల్లోలిపిల్​, సీపోతి వేషగాడు

ఒక్కప్పుడు ఉత్తర కేరళ అంతటా కనిపించే ఈ ఉత్సవం ఇప్పుడు కుట్టియాడి నిట్టూర్​లో మాత్రమే కనిపిస్తుంది.

ఇదీ చూడండి:బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
EBS - AP CLIENTS ONLY
1. News conference
2. SOUNDBITE (English) Natasha Bertaud, European Commission deputy chief spokesperson:
++TRANSCRIPTION TO FOLLOW++
3. News conference
4. SOUNDBITE (English) Natasha Bertaud, European Commission deputy chief spokesperson:
++TRANSCRIPTION TO FOLLOW++
5. Bertaud leaving
STORYLINE:
The European Union on Monday said the United Kingdom would be worse hit by a no-deal Brexit than the trading bloc.
EU Commission deputy chief spokesperson Natasha Bertaud said an exit without a withdrawal agreement would cause "significant disruption both for citizens and for businesses and this will have a serious negative economic impact," adding this would be "proportionally much greater in the United Kingdom than it would be in the EU 27 states."
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.