పాకిస్థాన్ క్రూరమైన చర్యలను భారత్ భద్రతా బలగాలు సరిహద్దు వరకే పరిమితం చేశాయని.. దీటుగా బదులిస్తున్నాయని అన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ విషయంలో భారత సైన్యం, సరిహద్దు దళాలు సహా ఇతర భద్రతా బలగాలను ప్రశంసించాలన్నారు. 2020లో పాక్ 4,649సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు తెలిపిన సింగ్.. భద్రతా బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు రాజ్‌నాథ్.
ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన రాజ్‌నాథ్.. 11 రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చాయని.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య 17కు చేరుతుందన్నారు. 2022 ఏప్రిల్ నాటికి అన్ని విమానాలు (మొత్తం బ్యాచ్) భారత్ చేరుకుంటాయన్నారు.
విదేశాల నుంచి దిగుమతి కాని.. 101 రక్షణ పరికరాలు భారత్‌లోనే తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోంది: మోదీ