ETV Bharat / bharat

రెండోదశ స్వచ్ఛ​ భారత్​- మరో అడుగు స్వచ్ఛతవైపు

author img

By

Published : Mar 5, 2020, 5:47 AM IST

Updated : Mar 5, 2020, 9:26 AM IST

గ్రామీణ స్థాయిలో రెండోదశ స్వచ్ఛ భార్​త్​ మిషన్​ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి గ్రామ పంచాయతీలో తడి-పొడి వ్యర్థాలను నిర్వహించేందుకు రూ.1,40,881 కోట్ల నిధుల​ను ఈ బడ్జెట్​లో కేటాయించారు. మొదటి దశలో ప్రారంభించిన మరుగుదొడ్లు.. వాడకం పరంగా ఐదేళ్లలో సాధించిన పురోగతిని రెండోదశలోనూ నిలబెట్టుకోవడంపై ఈ మిషన్​ దృష్టి సారించనుంది.

Second phase of Swachh Bharat Mission launched
గ్రామీణ రెండోదశ స్వచ్ఛభారత్​ మిషన్​ ప్రారంభం

దేశంలో పరిశుభ్రతను పెంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి చేసి, స్వచ్ఛతవైపు నడిపించేందుకు రెండోదశ స్వచ్ఛభారత్​ మిషన్​ను బుధవారం ప్రారంభించింది. బహిరంగ మల విసర్జనను పూర్తిస్థాయిలో అరికట్టడం, తడి-పొడి వ్యర్థాలను నిర్వహించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని 2020-21 నుంచి 2024-25 వరకు అమలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.1,40,881 కోట్లు వెచ్చించనుంది.

గత సూచనల ఆధారంగా పర్యవేక్షణ...

2014లో ప్రారంభమైన స్వచ్ఛభారత్​ మిషన్​లో భాగంగా... గ్రామీణ ప్రాంతాల్లో పదికోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించామని కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్రసింగ్​ షెఖావత్​ తెలిపారు. దేశవ్యాప్తంగా 699 జిల్లాల్లో 5.9 లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మలవిసర్జనను నిషేధించాయని మంత్రి అన్నారు. ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి నిర్వహణ లోపాలున్న నాలుగు ప్రాంతాల్లో గత సూచనల ఆధారంగా స్వచ్ఛభారత్​ పర్యవేక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.

రెండోదశ స్వచ్ఛభారత్​ మిషన్​ ముఖ్యంగా గృహనిర్మాణ, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణంతో సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదే విధంగా కంపోస్ట్​ గుంతలు, మురుగు కుంటలు, వ్యర్థాల స్థిరీకరణ, చెరువులు, పునరుత్పత్తి సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించనుంది.

సర్వేలు ఏం చెబుతున్నాయంటే...

ఫిబ్రవరిలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, యునిసెఫ్ ఓ సర్వే నిర్వహించింది. బిహార్, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్​ రాష్ట్రాలలోని మహిళలను ఆధారంగా చేసుకొన్న ఈ సర్వే ద్వారా ఓ నివేదికను రూపొందించారు. స్వచ్ఛ భారత్​ మిషన్​ ద్వారా మహిళల సౌలభ్యం, భద్రత పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. బహిరంగ మలవిసర్జన బారి నుంచి 93 శాతం మహిళలు బయటపడ్డారని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది.

ఇదీ చదవండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

Last Updated : Mar 5, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.