ETV Bharat / bharat

'స్థానిక పరిస్థితుల ఆధారంగా పాఠశాలలు తెరవచ్చు'

author img

By

Published : Aug 11, 2020, 9:31 PM IST

విద్యా సంస్థలను తిరిగే ప్రారంభించే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. అన్నిరకాల భద్రత చర్యలను పాటిస్తూ.. నిరంతర పర్యవేక్షణలో పాఠశాలలను తెరుచుకోవచ్చని సూచించింది.

Schools can reopen if precautions in place: WHO
స్థానిక పరిస్థితుల ఆధారంగా పాఠశాలలు తెరవవచ్చు

కరోనా సంక్షోభంతో దేశవ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించే అంశంపై స్పష్టతనిచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ప్రతినిధి డాక్టర్​ సౌమ్య స్వామినాథన్​. అన్ని రకాల భద్రతా చర్యలతో పాఠశాలలను నిర్వహించవచ్చని తెలిపారు. అయితే.. తప్పనిసరిగా నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.

"పాఠశాలలను ప్రారంభించడమనేది స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో విద్యాసంస్థలను తెరవొద్దు. ఈ పరిస్థితుల్లో ప్రమాదాలను, ప్రయోజనాలను అంచనా వేసుకోవాలి."

- సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్​ఓ ప్రతినిధి ​

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్ని తిరిగి తెరిచేందుకు యోచిస్తున్న తరుణంలో స్వామినాథన్​ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: కరోనా వేళ బడికి వెళ్లలేమంటున్న విద్యార్థులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.