యూపీఏ-2 హయాం... 2010లో కాంగ్రెస్ నేత పి. చిదంబరం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2002-2014 మధ్య గుజరాత్ హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అమిత్ షా. అదే సమయంలో 2005లో గుజరాత్ పోలీసులు సోహ్రబుద్దీన్ షేక్ అనే నేరస్థుడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలోనే సోహ్రబుద్దీన్ మృతి చెందారు. సుప్రీం ఆదేశాలతో అపహరణ, హత్య ఆరోపణ కింద 2010లో అమిత్‌షా అరెస్టయ్యారు.
కట్ చేస్తే... పదేళ్ల అనంతరం అమిత్‌షా కేంద్ర హోంమంత్రి. ప్రస్తుతం ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరాన్ని అరెస్టు చేశారు సీబీఐ అధికారులు.
ఇదీ చూడండి: తొలి రఫేల్ యుద్ధ విమానానికై ఫ్రాన్స్‌కు రక్షణమంత్రి