పీఎం కేర్స్ నిధులను ఎన్డీఆర్ఎఫ్కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ గాంధీ దుర్మార్గపు ఆలోచనలకు, ఆయనకు వత్తాసు పలికే వారికి చెంపపెట్టు లాంటిదన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. కాంగ్రెస్, దాని అనుచరుల హానికర ప్రయత్నాలు విఫలమై వాస్తవమే గెలిచిందన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.
-
The verdict by Supreme Court on PM CARES is a resounding blow to the nefarious designs of Rahul Gandhi & his band of ‘rent a cause’ activists. It shows that the truth shines despite the ill intent and malicious efforts of the Congress party and its associates.
— Jagat Prakash Nadda (@JPNadda) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The verdict by Supreme Court on PM CARES is a resounding blow to the nefarious designs of Rahul Gandhi & his band of ‘rent a cause’ activists. It shows that the truth shines despite the ill intent and malicious efforts of the Congress party and its associates.
— Jagat Prakash Nadda (@JPNadda) August 18, 2020The verdict by Supreme Court on PM CARES is a resounding blow to the nefarious designs of Rahul Gandhi & his band of ‘rent a cause’ activists. It shows that the truth shines despite the ill intent and malicious efforts of the Congress party and its associates.
— Jagat Prakash Nadda (@JPNadda) August 18, 2020
"పీఎం కేర్స్ నిధులపై సుప్రీం తీర్పు.. రాహుల్, అద్దె కార్యకలాపాలు నిర్వహించే ఆయన మద్దతుదారులకు కోలుకోలేని దెబ్బ. పీఎం కేర్స్‌కు విరాళాలిచ్చిన సాధారణ పౌరులంతా రాహుల్ తప్పుడు ప్రచారాలను తిరస్కరించారు. ప్రజల ద్వారా సేకరించిన పీఎంఎన్ఆర్ఎఫ్ నిధులను కాంగ్రెస్ కుటుంబ ట్రస్టులకు బదిలీ చేసుకుని దశాబ్దాలుగా వాడుకుంది. పీఎం కేర్స్‌పై తప్పుడు ప్రచారం చేయాలనుకోవడం కాంగ్రెస్ పాపాలను కడగడానికి చేసిన ప్రయత్నమని దేశ ప్రజలందరికీ తెలుసు. "
-జేపీ నడ్డా ట్వీట్
ఒక్క అవినీతి ఆరోపణ లేదు..
సుప్రీంతీర్పుపై న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా స్పందించారు. పీఎం కేర్స్ నిధుల నిర్వహణ చట్టపరంగా, పారదర్శకంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కోలేదని గుర్తు చేశారు. విద్వేష ప్రసంగాలపై ఫేస్బుక్ సీఈఓకు కాంగ్రెస్ లేఖ రాయడాన్ని విమర్శించారు రవిశంకర్. గతంలో సోనియా గాంధీ 'ఆర్ పార్ కీ లడాయి' అనడం, మోదీపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ద్వేషపూరిత ప్రసంగాలు కావా? అని ప్రశ్నించారు.