పౌరసత్వ చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలైన 143 పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. సీఏఏ రాజ్యాంగబద్ధతను పరిశీలించాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయూఎమ్ఎల్), కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సహా పలువురు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం డిసెంబర్ 18న కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
2014 డిసెంబర్ 31న లేదా అంతకుముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వం ఇచ్చేందుకు.. కేంద్రం పౌరచట్టాన్ని తెచ్చింది
భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ.. ముస్లింలపై వివక్ష చూపేవిధంగా సీఏఏ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈనెల 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని నిలిపివేయాలని ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
మరోవైపు పౌరచట్టం రాజ్యాంగ బద్ధమేనని ప్రకటించాలని ఈనెల 9న దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దేశం ప్రస్తుతం కిష్ల పరిస్థితుల్లో ఉందని, పెద్దఎత్తున హింస జరిగిందని సుప్రీం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం నెలకొనే ప్రయత్నాలు జరగాలని సూచించింది.