ఇండియా అనే ఆంగ్ల పదానికి బదులుగా 'భారత్' లేదా 'హిందుస్థాన్' అనే పదాలను ఉపయోగించాలంటా దాఖలైన పిటిషన్పై జూన్ 2న వాదనలు విననుంది సర్వోన్నత న్యాయస్థానం. ఈ పిటిషన్పై వాస్తవానికి నేడు విచారణ జరగాల్సి ఉండగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అందుబాటులో లేని కారణంగా వచ్చే నెలకు వాయిదా వేసింది సుప్రీం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ను సవరించాలని, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా అనే పేరుకు బదులుగా భారత్ లేదా హిందుస్థాన్ అనే పదాలను వాడాలంటూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత్, హిందుస్తాన్ అనే పేర్లు భారత చరిత్రను తెలియజేసేలా ఉంటాయని పిటిషన్‌లో అతడు పేరొన్నారు. 1948లో కూడా వీటి పేర్ల ప్రస్తావన వచ్చినట్లు పిటిషన్‌లో వివరించారు.
ఇదీ చూడండి:ఆపరేషన్ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?