ETV Bharat / bharat

వైద్యుల భద్రతపై రేపు సుప్రీంకోర్టు విచారణ

బంగాల్​లో వైద్యుల నిరసనల నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కోరుతూ శుక్రవారం పిటిషన్​ దాఖలైంది.

author img

By

Published : Jun 17, 2019, 12:10 PM IST

వైద్యుల భద్రతపై రేపు సుప్రీంకోర్టు విచారణ

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై న్యాయవాది అలోక్​ శ్రీవాత్సవ అత్యవసర విచారణ కోరగా జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ సూర్యకాంత్​తో కూడిన​ ధర్మాసనం అంగీకరించింది.

బంగాల్​లో జూడాల నిరసనల నేపథ్యంలో శుక్రవారం ఈ వ్యాజ్యం​ దాఖలైంది. దేశంలోని అన్ని సర్కారీ ఆస్పత్రుల్లో వైద్యుల రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమించే విధంగా హోంశాఖ, ఆరోగ్యశాఖ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేయాలని పిటిషనర్​ కోరారు.

జూడాల సమ్మెకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సోమవారం 'భారత వైద్య సంఘం' (ఐఎంఏ) ఆధ్వర్యంలో వైద్యులు సమ్మె చేపట్టారు.

ఇదీ చూడండి:- దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మె- రోగుల ఇక్కట్లు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.