ETV Bharat / bharat

ఐఐటీల్లో ఆత్మహత్యలపై పిల్.. పిటిషనర్​కు రూ.10వేల ఫైన్​​ - సుప్రీం కోర్టు వార్తలు

ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తీవ్రంగా స్పందించింది సుప్రీం కోర్టు. ఒక పనికిరాని పిటిషన్​గా పేర్కొంటూ కొట్టివేసింది. పిటిషనర్​, న్యాయవాది గౌరవ్​ బన్సాల్​కు రూ.10వేల జరిమానా విధించింది.

SC terms 'frivolous' PIL on rising suicides in IITs,
ఐఐటీల్లో ఆత్మహత్యలపై పిల్
author img

By

Published : Sep 24, 2020, 4:30 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించేందుకు సంరక్షణ చర్యలు చేపట్టేలా కేంద్రం, ఐఐటీలకు ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. అది ఒక పనికిమాలిన పిటిషన్​​ అని పేర్కొంటూ కొట్టివేసింది. పిటిషనర్​, న్యాయవాది గౌరవ్​ బన్సాల్​కు రూ.10వేల జరిమానా విధించింది.

పిటిషన్​పై వర్చువల్​గా చేపట్టిన విచారణలో ఈ మేరకు అభిప్రాయపడింది జస్టిస్​ ఆర్​ఎఫ్​ నారీమన్​ నేతృత్వంలోని ధర్మాసనం. కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అంశంలో అధికారులు దృష్టి సారించారని, వారికి అన్ని విషయాలు తెలుసని పేర్కొంది.

"ఇది పూర్తిగా పనికిరాని పిటిషన్​. మీకు ఎంత జరిమానా విధించొచ్చో చెప్పండి. లీగల్​ సర్వీసెస్​ అథారిటీకి చెల్లించాల్సిన ఖర్చుగా రూ.10వేలు జరిమానా విధించి ఈ పిటిషన్​ను కొట్టివేస్తున్నాం."

- ధర్మాసనం.

వర్చువల్​గా చేపట్టిన విచారణ సందర్భంగా.. గత ఐదేళ్లలో ఐఐటీ క్యాంపసుల్లో 50 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ధర్మాసనానికి తెలిపారు న్యాయవాది బన్సాల్​. ఈ అంశంలో కలుగజేసుకుని, విద్యార్థుల సంరక్షణకు చర్యలు చేపట్టేలా కేంద్ర విద్యాశాఖ, ఐఐటీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఐఐటీ, కాన్పుర్​ నేతృత్వంలో ఓ కమిటీని నియమించినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపారు.

ఇదీ చూడండి: రైతన్నల 'రైల్​ రోకో'.. శుక్రవారం రాష్ట్రబంద్​కు పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.