ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యేకు ఊరట- ఎన్నిక రద్దుపై సుప్రీం స్టే - supreme court order

భాజపా ఎమ్మెల్యే, గుజరాత్​ రాష్ట్ర మంత్రి భూపేంద్రసింహ చుడసామా ఎన్నికను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీం కోర్టు. ఆయన ఎన్నికను సవాల్​ చేసిన ప్రత్యర్థి, కాంగ్రెస్​ నేత అశ్విన్​ రాఠోడ్​కు నోటీసులు జారీ చేసింది.

SC stays Gujarat HC order
భాజపా ఎమ్మెల్యేకు ఊరట
author img

By

Published : May 15, 2020, 2:43 PM IST

గుజరాత్​ రాష్ట్ర మంత్రి, భాజపా నేత భుపేంద్రసింహ చుడసామాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 2017 ఎన్నికల్లో మోసపూరితంగా ఫలితాలు తారుమారు చేశారని తేల్చుతూ ఆయన ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది సర్వోన్నత న్యాయస్థానం.

జస్టిస్​ ఎల్​. నాగేశ్వర్​ రావు, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ బీఆర్​ గవాయ్​లతో కూడిన ధర్మాసనం చుడసామా పిటిషన్​పై విచారణ చేపట్టింది. స్టే నిర్ణయంపై వాదనలు సమర్పించాలని ఆదేశిస్తూ.. చుడసామా ప్రత్యర్థి, కాంగ్రెస్​ అభ్యర్థి అశ్విన్​ రాఠోడ్​కు నోటీసులు జారీ చేసింది.

చుడసామా ప్రస్తుతం విజయ్​ రూపానీ ప్రభుత్వంలో న్యాయ, శాసన, పార్లమెంటరీ వ్యవహారాలు, విద్య సహా ఇతర శాఖల మంత్రిగా చేస్తున్నారు.

దొల్కా నియోజకవర్గానికి 2017లో జరిగిన ఎన్నికల్లో కేవలం 327 ఓట్ల తేడాతో కాంగ్రెస్​ అభ్యర్థి అశ్విన్​ రాఠోడ్​పై భాజపా నేత చుడసామా గెలిచారు. పోస్టల్​ బ్యాలెట్లను తిరస్కరించటంపై అశ్విన్​ హైకోర్టును ఆశ్రయించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.