ETV Bharat / bharat

వలస కూలీల వేతనాలపై కేంద్రం స్పందన కోరిన సుప్రీం - వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు

లాక్​డౌన్​ వేళ వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్​పై సుప్రీం విచారణ చేపట్టంది. ఈ వ్యాజ్యంపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని కోరుతూ.. తదపరి విచారణను ఏప్రిల్​ 7కు వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

SC seeks response from Centre on plea by activists for payment of wages to migrant workers
వలస కూలీల వేతనాలపై కేంద్రం స్పందన కోరిన సుప్రీం
author img

By

Published : Apr 3, 2020, 3:45 PM IST

దేశ వ్యాప్తంగా లాక్​డౌన్​ విధించిన సందర్భంగా వలస కూలీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ జరిపిన జస్టిస్​ లావు నాగేశ్వరరావు, జస్టిస్​ దీపక్​ గుప్తా ధర్మాసనం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్​ 7కు వాయిదా వేసింది.

లాక్​డౌన్​ కారణంగా వలస కూలీలు, రోజు వారి కూలీలు, రిక్షా నడిపేవారు, చిన్న ఉద్యోగ కార్మికులు తినడానికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని... అలాంటి వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని పిటిషనర్లు కోరారు. అంతేకాకుండా వందలాది కూలీలు సొంతింటికి వెళ్లేందుకు బస్టాప్​లు​, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల సరిహద్దుల్లో తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని.. తద్వారా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వాదించారు. అందుకే వలస కూలీలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ధరల నియంత్రణకు హెల్ప్​లైన్ నెంబర్లు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్​లు, శానిటైజర్ల ధరల నియంత్రణకు కట్టుబడి ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ధరల కట్టడి సమర్థమంతంగా జరిగేలా హెల్ప్​లైన్​ నెంబర్లను ప్రచురిస్తామని అత్యన్నత న్యాయస్థానానికి వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.