ETV Bharat / bharat

ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి జీతాలపై సుప్రీంలో విచారణ - full wages issue

లాక్​డౌన్ సమయంలో ఉద్యోగులకు పూర్తిగా జీతాలు చెల్లించాలనే సూచనలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్ల​పై కేంద్రం వివరణ కోరింది సుప్రీంకోర్టు. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. లాక్​డౌన్​లో నష్టాల కారణంగా జీతాలు కోత లేకుండా చెల్లించలేమని మూడు ప్రైవేటు సంస్థలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

SC seeks Centre's reply
ప్రైవేటు ఉద్యోగులకు పూర్తి జీతాలపై సుప్రీంలో విచారణ
author img

By

Published : Apr 28, 2020, 3:55 PM IST

లాక్​డౌన్ సమయంలో ఉద్యోగులందరీకీ ప్రైవేటు సంస్థలు పూర్తి జీతాలు చెల్లించాలన్న కేంద్రం సూచనలను సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు​ దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నగ్రీక ఎక్స్​పోర్ట్స్​, ఫైకస్ ప్యాక్స్​ ప్రవేట్​ లిమిటెడ్​ సహా మరో సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ చేపట్టింది జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ సంజయ్ కిషన్​, జస్టిస్ బీఆర్​ గవాయ్​లతో కూడిన ధర్మాసనం. సమాధానం ఇచ్చేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని కేంద్రం తరఫు న్యాయవాది తుషార్​ మెహ్​తా కోరగా... అంగీకారం తెలిపింది న్యాయస్థానం. పిటిషన్ల ప్రతులు తుషార్​కు ఈమెయిల్ ద్వారా పంపాలని మూడు సంస్థలకు సూచించింది.

జీతాలు చెల్లించలేం...

లాక్​డౌన్ సమయంలో సంస్థల మూసివేత కారణంగా వ్యాపారంలో రూ.1.5కోట్లు నష్టం వచ్చిందని, ఉద్యోగులకు, ఒప్పంద కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించలేమని పటిషనర్లలో ఒకటైన నగ్రీక ఎక్స్​పోర్ట్స్​ వస్త్ర వ్యాపార సంస్థ కోర్టుకు నివేదించింది. సిబ్బంది జీతాల వ్యయం రూ.1.75కోట్లు అవుతుందని వివరించింది. మార్చి 29న కేంద్ర హోంశాఖ, మార్చి 31 మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు రాజ్యాంగబద్ధత లేదని పిటిషన్​లో పేర్కొంది. ప్రైవేటు సంస్థలకు ఆదేశాలు జారీ చేసే అధికారం వారికి లేదని తెలిపింది.

లాక్​డౌన్ పొడిగిస్తే నష్టాలు మరింత ఎక్కువగా ఎక్కువగా ఉంటాయని కోర్టుకు వివరించింది నగ్రీక సంస్థ. పిటిషన్ల​పై విచారణ జరిగే సమయంలో తమ ఉద్యోగులకు 50శాతం జీతాలు మాత్రమే చెల్లించేందుకు అనుమతించాలని కోరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.