దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలను తిరిగి తెరవాలంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం వివరణ కోరింది సుప్రీంకోర్టు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం హోం శాఖకు నోటీసు జారీ చేసింది.
అన్‌లాక్‌లో భాగంగా ఆలయాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయినా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఆలయాలు అన్నింటినీ తెరిచేలా చూడాలని గీతార్థ్ గంగా ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడం వల్ల కరోనా కారణంగా కలిగే మానసిక ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంది.