మహిళల రక్షణ కోసం.. కేంద్రం తీసుకొచ్చిన ముమ్మారు తలాక్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ముస్లిం మహిళలకు తలాక్ చెబితే.. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షను విధించే నిబంధన చెల్లుబాటును పరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది.
సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రాస్తోగిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఓ సంస్థ దాఖలు చేసన పిటిషన్‌ను పరిశీలించింది. ఈ వాజ్యంపై కేంద్రాన్ని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తలాక్ చట్టంపై గతంలో దాఖలైన పిటిషన్లతో పాటు ఈ వ్యాజ్యంపై విచారణ చేపడతామని పేర్కొంది.
కేంద్రం రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించి ముస్లిం మహిళల( వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని రూపొందించిందని సుప్రీం కోర్టులో ఇప్పటికే మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదీ చూడండి: చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ