లోక్‌సభ ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని క్రిస్టియన్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ లాంటి పవిత్రమైన రోజుల్లో ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు.
తమిళనాడు, పుదుచ్చేరిలో నిర్వహించే ఎన్నికలను వాయిదావేసి రీషెడ్యూల్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఎస్.ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
"పవిత్ర రోజుల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోలేరా? ప్రార్థనలు ఎలా చేయాలి, ఓటు ఎలా వేయాలి అని మేము సలహాలు ఇవ్వాలనుకోవట్లేదు" - సుప్రీం ధర్మాసనం.