శబరిమలకు వెళ్లే మహిళా భక్తులకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత నెల 26న అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించి, పెప్పర్ స్ప్రే బారిన పడిన బిందు అమ్మిని... ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. మహిళలకు రక్షణ కల్పించేలా కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అన్ని వయస్కుల మహిళలు ఆలయంలోకి వెళ్లొచ్చని.. గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇంకా కొనసాగుతోందని వ్యాజ్యంలో బిందు అమ్మిని పేర్కొన్నారు.
అయ్యప్ప ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశంపై నవంబర్ 14న సమీక్ష నిర్వహించిన జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం... స్టే విధించలేదని తెలిపింది. కేసును ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
అయితే ప్రచారం కోసం మహిళలు శబరికి రావొద్దని, సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని వస్తే రక్షణ కల్పిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.