ETV Bharat / bharat

కశ్మీర్​లో '4జీ'కి సుప్రీం నో... కమిటీ ఏర్పాటు

జమ్ము కశ్మీర్​లో 4జీ సేవల పునరుద్ధరణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే ఈ విషయంపై అధ్యయనం చేసేందుకు ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. జాతీయ భద్రత, మానవ హక్కుల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

SC orders setting up of panel headed by MHA secy to consider pleas seeking 4G in J-K
4జీ సేవలపై హైపవర్​ కమిటీ ఏర్పాటు చేయండి: సుప్రీంకోర్టు
author img

By

Published : May 11, 2020, 1:04 PM IST

జమ్ముకశ్మీర్​లో 4జీ అంతర్జాల సేవలు పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి, నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది.​ ఈ కమిటీలో జమ్ము కశ్మీర్​ ప్రధాన కార్యదర్శి, సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి కూడా ఉంటారని ధర్మాసనం స్పష్టం చేసింది.

జాతీయ భద్రత ముఖ్యం

జమ్ముకశ్మీర్​లో 4జీ సేవలు పునరుద్ధరించాలని... ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్, షోయబ్​ ఖురేషి, జమ్ము కశ్మీర్ ప్రైవేట్ పాఠశాలల సంఘం దాఖలు చేసిన పిటిషిన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. జస్టిస్​ ఎన్​.వి.రమణ, జస్టిస్ ఆర్​.సుభాష్​రెడ్డి, జస్టిస్​ బి.ఆర్.గవాయ్​ల త్రిసభ్య ధర్మాసనం... జమ్ము కశ్మీర్​లో 4జీ అంతర్జాల సేవలు పునరుద్ధరించేందుకు అనుమతి నిరాకరించింది. జాతీయ భద్రత, మానవ హక్కుల మధ్య సమతుల్యత ఉండాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: భారత్​లో కరోనా కొత్త రికార్డ్- ఒకేరోజు 4,213 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.