2019 సార్వత్రిక సమరంలో కేరళ వయనాడ్ ఎంపీగా రాహుల్‌గాంధీ ఎన్నికను సవాల్ చేస్తూ సరితా నాయర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ తరపు న్యాయవాదులు పలుమార్లు విచారణలో పాల్గొనకపోవటంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా విధించింది.
కేరళ సోలార్ స్కామ్‌కు సంబంధించిన రెండు కేసుల్లో సరిత దోషిగా తేలారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో వయనాడ్, ఎర్నాకుళం స్థానాలకు ఆమె వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించగా... నిరాశే ఎదురైంది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లగా... ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.