కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. రఫేల్ తీర్పుపై తన వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారన్న రాహుల్ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
భాజపా ఎంపీ మీనాక్షి లేఖ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 'చౌకీదార్ చోర్ హై' వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ రాహుల్ దాఖలు చేసిన ప్రమాణపత్రాన్ని పరిశీలించింది. ధిక్కరణ పిటిషన్ కొట్టివేయాలన్న రాహుల్ అభ్యర్థనను తిరస్కరించింది. రాహుల్కు కోర్టు ధిక్కరణ నోటీసు ఇవ్వడం సబబని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
కోర్టు ధిక్కరణ కేసును రఫేల్ తీర్పు పునఃసమీక్ష వ్యాజ్యాలతో కలిపి ఈ నెల 30న విచారిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు.
ఇదీ చూడండీ: భారత్ భేరి: బిహార్, కేరళలో ఈవీఎంల సమస్య