ETV Bharat / bharat

మానసిక సమస్యలకు బీమా కల్పించలేరా?: సుప్రీం

author img

By

Published : Jun 16, 2020, 7:39 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య తర్వాత మానసిక ఒత్తిడి, సమస్యల విషయంలో విపరీతమైన చర్చనడుస్తోంది. ఈ నేపథ్యంలో మానసిక అస్వస్థతకూ బీమా భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. బీమా కవరేజ్‌ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కేంద్రం, ఐఆర్‌డీఏను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.

supreme court on mental illness
మానసిక సమస్యలకు బీమా కల్పించలేరా?: సుప్రీం

మధుమేహం, క్యాన్సర్‌ తదితర వ్యాధులతోపాటు మానసిక సమస్యలు కూడా శరవేగంగా పెరిగిపోతున్నాయని నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఒత్తిడి, తీవ్ర పోటీ, ఇతర కారణాల వల్ల 25 శాతం మంది మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వివరిస్తున్నారు. 50 శాతం మానసిక రోగాలు వంశపారంపర్యంగా వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇటీవలే మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్​ యువహీరో సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య తర్వాత మానసిక రుగ్మతలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మానసిక సమస్యలకు బీమా కల్పించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.

సుప్రీం నోటీసులు..

వాదనలు విన్న అనంతరం.. మానసిక అస్వస్థతకూ బీమా భద్రతను కల్పించే అవకాశాలున్నాయా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ ఆర్‌ నారిమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. మానసిక సమస్యలకూ బీమా కవరేజ్‌ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

మానసిక అస్వస్థతకూ బీమా భద్రత కల్పించేలా కేటాయింపులు చేపట్టాలని బీమా కంపెనీలను ఆదేశించింది ఐఆర్‌డీఏ. శారీరక అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్సల తరహాలో మానసిక అనారోగ్యానికి బీమా కవరేజ్‌ కల్పించాలని బీమా కంపెనీలను ఆదేశిస్తూ ఐఆర్‌డీఏ 2018 మేలో ఉత్తర్వులు జారీ చేసింది.

15-20 ఏళ్లలోనే...

స్కీజోఫ్రినియా, బైపోలార్‌ డిప్రెషన్‌ వంటి దీర్ఘకాలిక మానసిక రుగ్మతలు 15-20 ఏళ్ల నుంచే ప్రబలుతున్నాయని తెలిపారు. ఉమ్మడి కుటుంబవ్యవస్థ విచ్ఛిన్నం కావడం, పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువగా గడపకపోవడం, మహిళలకు విరామ సమయంలో ఇతర వ్యాపకాలు లేకపోవడం, స్మార్ట్‌ఫోన్‌, టీవీలు, సినిమాలు, ఇతర అంశాలు మానసిక రుగ్మతలు పెరిగేందుకు కారణాలవుతున్నాయని పలువురు మానసిక వైద్య నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: కూల్​డ్రింక్​లపై వ్యాజ్యం​.. రూ.5 లక్షల జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.