ETV Bharat / bharat

మైనార్టీల గుర్తింపుపై వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సుప్రీం - bjp leader news

ముస్లింలు సహా ఇతర మతస్థులను మైనార్టీలుగా పరిగణించడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మతాన్ని పరిగణనలోకి తీసుకునేప్పుడు దేశం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.

supreme court
మైనార్టీలపై దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చిన సుప్రీం
author img

By

Published : Dec 17, 2019, 12:26 PM IST

Updated : Dec 17, 2019, 12:37 PM IST

దేశంలో ముస్లింలు సహా ఐదు మతాలను మైనార్టీలుగా గుర్తిస్తూ 26 ఏళ్ల క్రితం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలను మైనార్టీలుగా గుర్తిస్తూ గతంలో జారీచేసిన నోటిఫికేషన్‌కు కాలం చెల్లిందంటూ భాజపా నేత, న్యాయవాది అశ్వనికుమార్ ఉపాధ్యాయ సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది.

మైనార్టీ హోదా అనేది రాష్ట్రాలవారీగా ఆయా మతాల జనాభా ప్రాతిపదికన ఉండాలని పిటిషనర్‌ పేర్కొనగా... ఆ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఓ మతాన్ని పరిగణనలోకి తీసుకునేటప్పుడు దేశం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తేల్చిచెప్పింది. భాషను రాష్ట్రాల వారీగా పరిగణించవచ్చని.. మతానికి ఆ హద్దులు లేవని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. లక్ష్యద్వీప్​లో ముస్లింలు హిందూ చట్టాన్ని అనుసరిస్తారని ఉదహరించింది.

ఇదీ చూడండి: బంగాల్​లో మమత మరో ర్యాలీ- గువాహటిలో కర్ఫ్యూ ఎత్తివేత

Bengaluru, Dec 16 (ANI): Speaking on the matter regarding Tipu Sultan's lessons in Class 7 and 10 textbooks, Karnataka Primary and Secondary Education Minister, S Suresh Kumar told ANI that he is yet to receive the committee's report on it. Kumar said, "We are yet to receive the reports prepared by the committee regarding lessons on Tipu Sultan in textbooks. We have not received any report. Once I get the report, I will go through it, discuss with the Education team and take necessary action." BJP legislators like Appachu Ranjan objected to Tipu lessons in Class 7 and 10 textbooks glorifying him as a freedom fighter. Ranjan alleged Tipu was a tyrant and thus does not warrant being declared a 'freedom fighter'.
Last Updated : Dec 17, 2019, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.