ETV Bharat / bharat

అంబులెన్స్​ల అధిక ఛార్జీలపై సుప్రీం కన్నెర్ర

కరోనా కాలంలో అంబులెన్స్​ సేవల ఛార్జీలు అధికంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. తక్షణమే రాష్ట్రాలన్నీ నిర్ణీత ​ఛార్జీలను నిర్ణయించి, అమలు చేయాలని ఆదేశించింది.

author img

By

Published : Sep 11, 2020, 6:41 PM IST

Fix reasonable price for ambulance services, SC tells states
అంబులెన్స్​ ఛార్జీలపై సుప్రీంకోర్టు సీరియస్​

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుంటే.. అంబులెన్స్​ సేవలు అందించే సంస్థలు బాధితుల నుంచి అధిక ఛార్జీల పేరిట దోపిడీ చేస్తున్నాయి. రవాణా వ్యవస్థ ఇంకా గాడిన పడకపోవడం వల్ల ప్రజలు వీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ అంశంపై పలువురు ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేశారు. అంబులెన్స్​ల నిర్వాహకులు భారీగా ఛార్జీల వసూళ్లు చేస్తున్నారని.. వాటి ధరలకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలైంది.

ఆ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. అంబులెన్స్​ ఛార్జీల అధిక వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వాలు స్థిరమైన ఛార్జీలను నిర్ణయించాలని.. జస్టిస్​ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

"మార్చి 29న కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు అనుసరించడం తప్పనిసరి. రాష్ట్రాల్లో సరిపడా అంబులెన్స్​లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అంబులెన్స్​ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అవసరమైన వ్యక్తుల సహాయాన్ని అందించాలి."

-- సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.