ETV Bharat / bharat

'ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజులు తగ్గిస్తారా?' - ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజులు తగ్గిస్తారా? సుప్రీంకోర్టు ప్రశ్న

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజులు నియంత్రించాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద నిర్దేశించిన ఫీజుల ప్రకారం.. కొవిడ్​ చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

SC asks pvt hospitals if they are ready to charge Covid-19 patients at Ayushman Bharat rate
'ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజులు తగ్గిస్తారా?'
author img

By

Published : Jun 5, 2020, 2:43 PM IST

ఆయుష్మాన్ భారత్ పథకం కింద నిర్దేశించిన రుసుముల ప్రకారం.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా? అని సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. తామేమీ ఉచితంగా చికిత్స అందించమని కోరడం లేదని స్పష్టం చేసింది.

ఉచితంగా చికిత్స!

ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్​-19 చికిత్స ఫీజులను నియంత్రించాలని దాఖలైన పిటిషన్​పై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం నుంచి రాయితీగా భూమి పొందిన ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం నిర్దిష్ట బాధితుల వరకు ఉచితంగా చికిత్స అందించాలని సూచిస్తున్నట్లు స్పష్టం చేసింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టిన ఈ త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్​ బోపన్న, జస్టిస్​ హృషీకేశ్​ రాయ్​లు కూడా ఉన్నారు.

కేంద్రం చర్యలు తీసుకుంటోంది!

కేంద్రం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ తుషార్​ మెహతా కరోనా చికిత్స కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను న్యాయస్థానానికి వివరించారు. ఆయుష్మాన్ భారత్​ పథకం కింద చికిత్స పొందలేనివారి కోసం.. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: కరోనా రికార్డ్​: కొత్తగా 9,851 కేసులు, 273 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.