సార్వత్రిక ఎన్నికల్లో ఇంకా మిగిలి ఉన్న విడతల్లో పోలింగ్‌ను ఉదయం 5 గంటల నుంచి నిర్వహించాలన్న అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది సుప్రీంకోర్టు. ఎండవేడి, రంజాన్ దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ముందుకు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తక్షణ విచారణ చేపట్టింది.
పిటిషన్ దాఖలు చేసిన మహ్మద్ నిజాముద్దీన్ పాషా, అసద్ హయత్ అనే న్యాయవాదులు.... ఈ విషయంపై ఎన్నికల సంఘానికి విన్నవించినప్పటికీ స్పందించలేదని తెలిపారు.