ETV Bharat / bharat

సాగు చట్టాలపై 10 రాష్ట్రాలతో సుప్రీంకోర్టు కమిటీ చర్చలు - దిల్లీలో రైతు నిరసనలు

దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతుల సమస్యను పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ.. పది రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పలు రైతు సంఘాలు తమ అభిప్రాయాలను తెలిపినట్లు పేర్కొంది.

SC appointed panel holds consultations with state govt
సాగు చట్టాలపై 10 రాష్ట్రాలతో చర్చలు!
author img

By

Published : Feb 5, 2021, 10:20 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఓవైపు దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన కొనసాగుతుండగా, మరోవైపు సమస్య పరిష్కారం కోసం చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇదిలా కొనసాగుతున్న సమయంలో వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. ఇందులో భాగంగా, ఇప్పటి వరకు ఐదుసార్లు భేటీ అయిన కమిటీ.. పది రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది. ఆయా రాష్ట్రాల మార్కెటింగ్ బోర్డులు, ప్రైవేటు మండీల ఆపరేటర్లు, ఫుడ్‌ పార్క్‌ ప్రతినిధులతో పలు దఫాల్లో సంప్రదింపులు జరిపినట్లు నిపుణుల కమిటీ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై పది రాష్ట్రాలకు చెందిన వివిధ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నట్లు నిపుణులు కమిటీ శుక్రవారం వెల్లడించింది. ఈ సమావేశాల్లో రైతు సంఘాలు తమ అభిప్రాయాలను తెలిపినట్లు పేర్కొంది. సాగుచట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 11దఫాల్లో చర్చలు జరిపింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో రైతు సంఘాలు వారి ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: శాంతియుతంగానే 'చక్కాజామ్'​: రాకేశ్ టికాయిత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.