ETV Bharat / bharat

ఫడణవీస్​- రౌత్​ 'రహస్య భేటీ'కి కారణమిదే! - ఫడణవీస్​ ఇంటర్వ్యూ రౌత

సామ్నాలో ఇంటర్వ్యూ కోసం శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ తనను సంప్రదించినట్టు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ వెల్లడించారు. ఇరువురి మధ్య జరిగిన 'రహస్య భేటీ' సర్వత్రా చర్చనీయాంశమైన తరుణంలో ఫడణవీస్​ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తమ మధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదని ఫడణవీస్​ స్పష్టం చేశారు.

Sanjay Raut wanted my interview for 'Saamana': Fadnavis
ఫడణవీస్​- రౌత్​ 'రహస్య భేటీ'కి కారణమిదేనా?
author img

By

Published : Sep 28, 2020, 5:51 AM IST

Updated : Sep 28, 2020, 3:05 PM IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​, శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ మధ్య శనివారం జరిగిన 'రహస్య భేటీ' ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. భాజపా- శివసేన మధ్య అనేక విషయాల్లో పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్న పరిస్థితుల్లో.. వీరు కలుసుకోవడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. తాజాగా.. ఈ విషయంపై ఫడణవీస్​ స్పందించారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఇంటర్వ్యూ కోసం రౌత్​ తనను సంప్రదించినట్టు వెల్లడించారు.

"సామ్నా కోసం ఇంటర్వ్యూ కావాలని రౌత్​ నన్ను కోరారు. దీని కోసమే మేము కలిశాము. ఈ క్రమంలో నేను కొన్ని షరతులు పెట్టాను. ఎలాంటి మార్పులు లేకుండా విడుదల చేస్తేనే ఇంటర్వ్యూ ఇస్తానని స్పష్టం చేశాను. మా మధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు."

--- దేవేంద్ర ఫడణవీస్​, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.

మరోవైపు ఈ విషయంపై రౌత్​ ఇప్పటికే స్పందించారు. ఇంటర్వ్యూ కోసమే కలిసినట్టు వివరించారు. ఇతర పార్టీల నేతలను కలవడం నేరమా? అంటూ ప్రశ్నించారు.

ఇదీ చూడండి:- బిహార్ ఎన్నికల బరిలో శివసేన- ఠాక్రే సమాలోచనలు!

Last Updated : Sep 28, 2020, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.