భారత రాజధాని దిల్లీ, పాక్‌లోని లాహోర్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు పునఃప్రారంభమయ్యాయి. భారత వైమానికదళం దాడుల నేపథ్యంలో ఫిబ్రవరి 28న సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సేవలు నిలిచిపోయాయి.
పాక్ చేతికి చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ శుక్రవారం విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో సేవల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు ఇరు దేశాధికారులు.
ఆదివారం దిల్లీ నుంచి ప్రారంభమయ్యే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ సోమవారం లాహోర్ నుంచి తిరుగు ప్రయాణమవుతుంది. అటారీ-వాఘా సరిహద్దు నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది.