కీలక భద్రతా విభాగాలకు నూతన డైరెక్టర్ల నియామకంపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ నిఘా వ్యవహారాలను పర్యవేక్షించే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా)కి సామంత్ గోయెల్‌ని నియమించారు. దేశ అంతర్గత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)కి అరవింద్ కుమార్‌ని డైరెక్టర్‌గా నియమించారు.
వీరిద్దరూ 1984 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన అధికారులు. పంజాబ్ కేడర్‌లో గోయెల్, అసోం-మేఘాలయలో అరవింద్ కుమార్ పనిచేశారు.
వ్యూహ రచనల్లో కీలకం
సామంత్ గోయెల్ నిఘా వర్గాల కార్యక్రమాల విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. బాలాకోట్‌పై వైమానిక దాడులు, 2016 మెరుపు దాడుల వ్యూహ రచనలో ఆయన పాత్ర ఉంది. 1990లో పంజాబ్‌లో చెలరేగిన తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొన్న వ్యక్తిగా సామంత్‌కు మంచి పేరుంది. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపైనా ఈయనకు మంచి అవగాహన ఉంది.
ఐబీ చీఫ్‌గా ఎన్నికైన అరవింద్ కుమార్ వామపక్ష తీవ్రవాదాన్ని నిరోధించడంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం ఈయన ఐబీ కశ్మీర్ విభాగంలో ప్రత్యేక సంచాలకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి: జీ-20 సదస్సు: ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులే ఎజెండా