ETV Bharat / bharat

రాజ్యసభ సభ్యుడు అమర్​ సింగ్​ కన్నుమూత - రాజ్యసభ ఎంపీ అమర్​ సింగ్ కన్నుమూత

SAMAJWADI Party leader Amar Singh  died
రాజ్యసభ సభ్యుడు అమర్​ సింగ్​ కన్నుమూత
author img

By

Published : Aug 1, 2020, 4:51 PM IST

Updated : Aug 1, 2020, 5:31 PM IST

17:26 August 01

రాజ్యసభ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌ సింగ్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. ఈ ఏడాది మార్చి నుంచి అమర్‌ సింగ్‌ అనారోగ్యంతో సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. 2013లో ఆయన మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అజాంగఢ్​‌లో జన్మించిన అమర్‌ సింగ్‌ గతంలో సమాజ్‌వాదీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. 

2008లో యూపీఏ ప్రభుత్వానికి కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించిన సమయంలో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు అండగా నిలిచింది. ఆ సమయంలో అమర్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అమర్‌ సింగ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

16:45 August 01

రాజ్యసభ సభ్యుడు అమర్​ సింగ్​ కన్నుమూత

సమాజ్​వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్​ సింగ్​ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆయన సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2013లో ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడి కోలుకుని 2016లో తిరిగి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.

Last Updated : Aug 1, 2020, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.