పరిశుభ్రత కోసం తమ వంతు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
"ఆరోగ్యరక్షణ అభివృద్ధికి పని చేస్తున్న అన్ని సంస్థలకు, వ్యక్తులకు అభినందనలు. మెరుగైన ఆరోగ్యం కోసం పరిశుభ్రత, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగు పరుస్తున్న వారందరిని చూసి నేను గర్విస్తున్నాను "
-మోదీ ట్వీట్
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు మోదీ. ఆయుష్మాన్ భారత్ లాంటి అతి పెద్ద ఆరోగ్య కార్యక్రమం.. ప్రతి ఒక్క భారతీయునికి గర్వకారణమని తెలిపారు. దీని ద్వారా 50 కోట్ల మందికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.