ETV Bharat / bharat

నిత్యం 5వేల మందికి అయ్యప్ప దర్శనం! - sabarimala flash news today

కేరళలో కొవిడ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అయ్యప్ప భక్తులు నెగటివ్​ రిపోర్టు చూపించడం తప్పనిసరి చేసింది ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌. ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకుని.. నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే శబరిమల దర్శనానికి అనుమతిస్తామని టీడీబీ అధ్యక్షుడు ఎన్‌ వాసు వెల్లడించారు.

SABARIMALA DEVOTEES SHOULD SHOW COVID NEGATIVE REPORT TO ENTER AYYAPPAN TEMPLE
నిత్యం 5వేల మందికి అయ్యప్ప దర్శనం!
author img

By

Published : Dec 21, 2020, 5:31 AM IST

కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోన్న దృష్ట్యా శబరిమల వెళ్లే యాత్రికులు కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌(టీబీడీ) వెల్లడించింది. డిసెంబర్‌ 26తేదీ నుంచి వచ్చే భక్తులు కరోనా వైరస్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌లో వచ్చిన నెగటివ్‌ రిపోర్టును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం 2 వేల మందిని అనుమతిస్తుండగా.. శని, ఆదివారాల్లో మాత్రం రోజు 3వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక వచ్చేవారం నుంచి రోజు 5వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమల క్షేత్రాన్ని దర్శించేందుకు కేరళ హైకోర్టు అనుమతించింది.

ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకుని.. నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే శబరిమల దర్శనానికి అనుమతిస్తామని టీడీబీ అధ్యక్షుడు ఎన్‌ వాసు వెల్లడించారు. అంతకుముందు కేవలం యాంటీజెన్‌ టెస్టులో పరీక్ష రిపోర్టు ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించారు. కానీ, డిసెంబర్‌ 31 నుంచి జనవరి 19 వరకు జరిగే మకరవిళక్కు (మకర జ్యోతి దర్శనం) పండుగ వేళ నెగటివ్‌ రిపోర్టు(ఆర్​టీపీసీఆర్​) లేని భక్తలను కొండపైకి అనుమతించమని టీబీడీ బోర్డు అధ్యక్షుడు స్పష్టంచేశారు.

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకొన్నట్టుగా ఉన్న కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శన సమయంలో ప్రతిఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. ఇదిలాఉంటే, శబరిమల ఆలయానికి కేరళ ప్రభుత్వం రూ.50కోట్లను అందించినట్లు టీడీబీ వెల్లడించింది.

ఇదీ చూడండి: స్వామీ.. కొవిడ్‌ పరీక్ష తప్పదు సుమీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.