ETV Bharat / bharat

పాలు తాగే శివుణ్ని చూద్దామని కటకటాలపాలయ్యారు!

శివుడు పాలు తాగుతున్నాడనే వార్త విని ఉత్తర్​ప్రదేశ్​ శంషేర్​గంజ్​లో ఓ ఆలయానికి జనాలు తండోపతండాలుగా వెళ్లారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్​డౌన్​ను ఉల్లంఘించి బయటకు వచ్చినందుకు పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు.

Rumour of Lord Shiva drinking milk, 13 held
పాలు తాగే శివుణ్ని చూద్దామని కటకటాలపాలయ్యారు!
author img

By

Published : Apr 13, 2020, 5:11 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో శివుడు పాలు తాగుతున్నాడన్న వార్త విని భక్తులు పాల డబ్బాలతో ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే లాక్​డౌన్​ ఉత్తర్వులను అతిక్రమించినందు వల్ల 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని ప్రతాప్​గర్​ శంషేర్​గంజ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

అరెస్టు చేసిన వారిపై ఐపీసీ సెక్షన్​ 188 కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరెవరు ఆలయంలోకి ప్రవేశించారన్న విషయంపై విచారణ చేపడుతున్నారు పోలీసులు. శివుడు పాలు తాగుతున్నాడని అసత్య ప్రచారం చేసిన రాజేశ్​ కౌశల్​ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించొద్దని, లాక్​డౌన్​ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్థానికులకు పోలీసులు సూచించారు. గతవారంలో ప్రతాప్​గర్​ నగరంలో 6 కరోనా కేసులు నిర్ధరణయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.