ETV Bharat / bharat

'ప్రభుత్వ తప్పుడు విధానాలే జీడీపీ పతనానికి కారణం'

ఆర్థిక వృద్ధి క్షీణతను ఉద్దేశించి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. నోట్ల రద్దుతో జీడీపీ పతనం ఆరంభం కాగా.. ఆ తర్వాత అనుసరించిన విధానాలు మరింత క్షీణతకు దారితీశాయని ధ్వజమెత్తింది.

'Ruining' of economy began with demonetisation, govt introduced erroneous policies: Rahul
'ప్రభుత్వ తప్పుడు విధానాలే జీడీపీ పతనానికి కారణం'
author img

By

Published : Sep 1, 2020, 4:59 PM IST

కరోనా కష్టకాలంలో దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) భారీ క్షీణతపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​. నోట్ల రద్దుతో ఆర్థిక వృద్ధి పతనం ప్రారంభమైందని ఆరోపించింది. 1996 తర్వాత ఎన్నడు లేనంతగా జీడీపీ క్షీణించడానికి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ధ్వజమెత్తింది​.

'జీడీపీ 23.9 శాతం క్షీణించింది. డీమానిటైజేషన్​తో ఆర్థిక వృద్ధి పతనం మొదలైంది. అప్పటినుంచి ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ఆర్థిక వృద్ధి రేటు క్షీణిస్తూ వస్తోంది.' అని ట్వీట్​ చేశారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.

ఆర్థిక తిరోగమనానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు మరో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా. భాజపా ప్రభుత్వమే జీడీపీ క్షీణతకు కారణమని ఆరోపించారు.

'మోదీజీ ఇప్పుడైనా అంగీకరించండి. మీరు మైలురాళ్లుగా భావించే డీమానిటైజేషన్​, జీఎస్టీ, లాక్​​డౌన్​ అమలు వంటివి జీడీపీకి విఘాతాలు' అని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కరోనా సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్​-జూన్​)లో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 23.9శాతం క్షీణించింది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్​ఎస్​ఓ) ప్రకటించింది.

ఇదీ చూడండి: 'మెట్రో కూతతో గ్రామాల్లో వైరస్​ వ్యాప్తి తీవ్రం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.