రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశంలో నైతిక, సాంస్కృతిక, మానవ విలువలను పెంపొందించేందుకు మాత్రమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నాలుగు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగించారు.
అన్ని వర్గాల ప్రజలు ఆర్ఎస్ఎస్లో భాగమన్నారు భగవత్. అందులో కొందరు రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికలతో తమకు సంబంధం లేదన్న భగవత్ 60 ఏళ్లుగా తాము దేశ విలువలను నిలబెట్టేందుకు నిర్విరామ కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. భాజపా... ఆర్ఎస్ఎస్ రిమోట్ కంట్రోల్ అన్న ఆరోపణలను ఆయన ఖండించారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి దేశానికి సేవ చేయాలనుకునే వారందరూ ఆర్ఎస్ఎస్లో చేరవచ్చని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.
"మా పని మంచిది. మంచి పనులు చేయడాన్ని పెంచుతున్నాం. మాకు మరో ఎన్నికలు గెలిచేది ఏమీ లేదు. మేం ఎన్నికల కోసం చేసేది లేదు. దేశం కోసం మాత్రమే పనిచేస్తాం. చరిత్రలో మా పేరు లేకపోయినా ఫర్వాలేదు. అలా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. సిద్ధాంతాలకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న విభాగాల్లో మంచి పనులు చేపడుతుంది. ఇవి ఆయా విభాగాలు స్వతంత్రంగా చేపట్టే కార్యక్రమాలు అయి ఉంటాయి. పలుసార్లు పత్రికలు పేర్కొన్నట్లుగా రిమోట్ కంట్రోల్ ఏమీ ఉండదు."
-మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇదీ చూడండి: 'పౌర' చట్టంపై పోరాడేవారు ఎస్సీ వ్యతిరేకులు: షా