అతి సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలవడనున్న నేపథ్యంలో ముస్లిం మతాధికారులతో ఆర్ఎస్ఎస్, భాజపా కార్యకర్తలు సమావేశమమ్యారు. ఈ భేటీలో మతాధికారులు, విద్యావేత్తలు, ఇరు వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. తీర్పు వెలువడిన తర్వాత.. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా.. అందరూ సామరస్యంతో, ఐకత్యతో మెలగాలని సమావేశంలో సూచించారు.
మత సామరస్యాన్ని, సోదర భావాన్ని, ఐక్యతను బలోపేతం చేయటానికి ఇరువర్గాలు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఐక్యతను నాశనం చేయటానికి పన్నే కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఇరు మతాధికారులు తీర్మానించారు. మత సామరస్యమే ఈ దేశ గొప్పతనమని.. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. ఈ ఐక్యతను కాపాడుకోవటం ఇరు వర్గాల నైతిక బాధ్యతని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు, కృష్ణ గోవాల్, రాంలాల్, కేంద్ర మాజీ మంత్రి షహ్నావాజ్ హుస్సేన్, జమియాత్ ఉలేమా ఎ హింద్ ప్రధాన కార్యదర్శి మహమూద్ మదాని, చిత్ర నిర్మాత ముజాఫర్ అలీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు కమల్ ఫరూకీ, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, షియా మతాధికారి కల్బే జవాద్, ఇతర ముస్లిం ప్రముఖలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'భారత్'ను పరిశోధించిన 1000 మంది ఎంఐటీ విద్యార్థులు