ETV Bharat / bharat

పార్లమెంటు సమావేశాలు ఈసారి సరికొత్తగా...

కరోనా నిబంధనలను అమలు చేస్తూ వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు పార్లమెంట్​లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల మూడో వారంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తవ్వాలని రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో శరవేగంగా పని చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

RS Chairman directs full preparedness by third week of August for Monsoon session of Parliament.
వర్షాకాల సమావేశాలకు పార్లమెంట్​ సన్నద్ధం
author img

By

Published : Aug 16, 2020, 3:50 PM IST

Updated : Aug 16, 2020, 4:48 PM IST

వర్షాకాల సమావేశాల నిర్వహణ కోసం పార్లమెంట్​లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల మూడో వారంలోగా అన్ని ఏర్పాట్లు పూర్తవ్వాలన్న రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్నట్టు ఎగువ సభ సెక్రటేరియట్​ వెల్లడించింది.

ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జరగనున్నట్టు సమాచారం. కరోనా ఆంక్షల నేపథ్యంలో పార్లమెంట్​ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరాన్ని కఠినంగా పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ఓ సభ ఉదయం పూట, ఇంకో సభ సాయంత్రం వేళ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు. అనుకున్న సమయానికి అన్ని సిద్ధం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టు రాజ్యసభ సెక్రటేరియట్​ వెల్లడించింది.

పార్లమెంట్​ ముస్తాబవుతోంది ఇలా...

  • భౌతిక దూరాన్ని పాటించడం కోసం రాజ్యసభ సభ్యులు రెండు ఛాంబర్లు, గ్యాలరీల్లో కూర్చుంటారు. 60 మంది రాజ్యసభ ఛాంబర్​లో, 51 మంది గ్యాలరీల్లో, మిగిలిన 132 మంది లోక్​సభ ఛాంబర్​లో కూర్చుంటారు.
  • పార్టీల బలాల బట్టి రాజ్యసభ ఛాంబర్​లో సీట్ల కేటాయింపు ఉంటుంది. మిగిలిన వారి కోసం లోక్​సభలోని రెండు బ్లాక్​లను కేటాయించనున్నారు.
  • ప్రధానమంత్రి, సభాపక్షనేత, ప్రతిపక్ష సభాపక్ష నేత సహా ఇతరుల కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తారు.
  • మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్​ సింగ్​, దేవగౌడ, కేంద్ర మంత్రులు రామ్​ విలాస్​ పాసవాన్​, రామ్​దాస్​ అఠావలే కోసం కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. మిగిలిన వారు అధికార పక్షం కోసం కేటాయించిన సీట్లలో కూర్చుంటారు.
  • వీటిని గుర్తించే విధంగా ప్లకార్డులను ఏర్పాటు చేస్తారు.
  • లోక్​సభలోనూ ఇదే విధంగా కూర్చునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
  • సభ ఛాంబర్​లో నాలుగు అదనపు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. మరో 6 చిన్న స్క్రీన్లను 4 గ్యాలరీల్లో పెడతారు. వీటితో పాటు ఆడియో సెట్లు, రెండు సభలను అనుసంధానించేందుకు కావాల్సిన కేబుళ్లు, ఆడియో-వీడియో సిగ్నళ్లు. గ్యాలరీని ఛాంబర్​ ఆఫ్​ హౌస్​ నుంచి వేరు చేసేందుకు ఏర్పాటు చేసే పాలీకార్బొనేట్​ షీట్లను ఏర్పాటు చేస్తున్నారు.
  • అధికారులు, విలేకరులు కూర్చునే గ్యాలరీల్లో భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపడుతున్నారు.
  • ఆర్​ఎస్​ టీవీ, ఎల్​ఎస్​టీవీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. వీటితో పాటు ఇరు సభల్లోనూ ఉండే ప్రత్యేక స్క్రీన్లు కూడా ప్రసారాలు చేస్తాయి.

వర్షాకాల సమావేశాల నిర్వహణపై లోక్​స​భ స్పీకర్​ ఓం బిర్లాతో జులై 17న చర్చలు జరిపి అనంతరం అధికారులకు అదేశాలు జారీ చేశారు వెంకయ్య నాయుడు. భౌతికంగా తాకే పత్రాల సంఖ్యను కూడా తగ్గించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:- 'కమల' వికాసం కోసం ఆ ఊళ్లో నిత్య పూజలు!

Last Updated : Aug 16, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.