కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని తమిళనాడులోని శివగంగ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించడంపై స్థానిక సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి ఈ.ఎం.సుదర్శన నచియప్పన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిదంబరం కుటుంబాన్ని తమిళ ప్రజలు ఇష్టపడడం లేదని తెలిపారు. దీని వల్ల పార్టీకి తమిళనాడులో తప్పకుండా నష్టం జరుగుతుందన్నారు.
శివగంగ లోక్సభ స్థానం నుంచిపి.చిదంబరం 1984నుంచి ఏడుసార్లు గెలుపొందారు.
చిదంబరం కుటుంబం తమిళనాడు ప్రజలకు చేసిందేమి లేదని ఆరోపించారు నచియప్పన్. యూపీఏ అధికారంలో ఉన్నపుడు కేంద్రమంత్రిగా ఉన్న పి. చిదంబరం.... తనను పార్టీలో ఎదగనీయకుండా అడ్డుకున్నారని విమర్శించారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి కార్తీకి చెందిన రూ.54కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఇదీ చూడండి..కర్ణాటక సంకీర్ణ రాజకీయాల్లో ఊహించని మలుపు