క్లిష్టమైన పర్వత ప్రదేశాలలో ఉండే 'రోప్ వే'లను, అక్కడికి వెళ్లే కేబుల్ కార్లను, ఫనిక్యూలర్ రైల్వే మార్గాలను కేంద్ర రోడ్లు, రవాణా శాఖ పరిధిలో తీసుకొస్తున్నట్లు ఆ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. విద్యుత్ ఆధారంగా నడిచే ప్రజారవాణా వ్యవస్థను తీసుకొస్తునట్లు ప్రకటించారు.
ఈ కారణంగా మారుమూల కొండ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పెరుగుతాయని తెలిపారు. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, అరుణాల్ ప్రదేశ్ పర్వత ప్రాంత రాష్ట్రాలలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని అన్నారు.
రోప్ వే ప్రాజెక్ట్‌లు అమెరికాలో 2,000, ఫ్రాన్స్‌లో 4000, స్విట్జర్లాండ్‌లో 1500 ఉండగా భారత్‌లో కేవలం 65 ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'భారత్‌ను నమ్ముతాయి.. చైనాను కాదు'