ETV Bharat / bharat

50-30 లాక్​డౌన్​ వ్యూహంతో కరోనా కట్టడి!

కరోనా నియంత్రణ కోసం కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ఓ కొత్త వ్యూహాన్ని సూచిస్తున్నారు. 50/30 రోజుల రోలింగ్ లాక్​డౌన్ సూత్రాన్ని పాటించడం ద్వారా కొవిడ్-19 మరణాలు తగ్గించవచ్చని వారు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేనందున భౌతిక దూరం, ఆరోగ్య సూత్రాలు పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

Rolling 50/30 day cycles of lockdown and relaxation
కరోనా నియంత్రణకు శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
author img

By

Published : May 20, 2020, 4:38 PM IST

కరోనా ఉద్ధృతిని తగ్గించాలంటే... 50/30 రోజుల రోలింగ్​ లాక్​డౌన్ సూత్రాన్ని పాటించాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంటే 50 రోజులపాటు కఠినంగా లాక్​డౌన్​ అమలు చేసి, తరువాత 30 రోజులపాటు సడలింపులు ఇవ్వాలి. తరువాత మళ్లీ ఇదే విధంగా 50 రోజులు కఠిన లాక్​డౌన్, 30 రోజులపాటు సడలింపులు ఇస్తూ ఉండాలి.

ఈ వ్యూహం వల్ల కరోనా మరణాలతోపాటు ఐసీయూలో చేరే రోగుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదంతా సాధించడానికి ఆరున్నర నెలల వరకు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

కఠినంగా ఉండాల్సిందే..

ప్రస్తుతానికి కరోనాను సమర్థంగా నియంత్రించే చికిత్సలు గానీ, వ్యాక్సిన్​గానీ అందుబాటులో లేవు. అందువల్ల కొవిడ్​-19 మహమ్మారిని నియంత్రించాలంటే లాక్​డౌన్​ అనివార్యమని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

టెస్ట్- కాంటాక్ట్ ట్రేస్-ఐసొలేట్​

రోలింగ్ లాక్​డౌన్​తో పాటు కరోనా పరీక్షలు నిర్వహించడం, కాంటాక్ట్ కేసులను గుర్తించడం, కరోనా రోగులను నిర్బంధంలో ఉంచడం అనే వ్యూహాన్ని సమర్థంగా అమలు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

కరోనా సోకకుండా..

కరోనా ప్రభావాన్ని నియంత్రణ, నివారణ అనే రెండు చర్యల ద్వారా అదుపులోకి తీసుకురావచ్చని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం, కేసుల ఆధారంగా ఐసొలేషన్ విధించడం, భారీ సమావేశాలు జరగకుండా చూడడం, పాఠశాలలు మూసివేయం వల్ల కరోనా అంటువ్యాధిని సమర్థంగా నియంత్రించవచ్చని అంటున్నారు. అయితే లాక్​డౌన్ లాంటి చర్యలతో కరోనా కేసుల సంఖ్యను మరింత వేగంగా తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నారు.

అధ్యయనం ప్రకారం..

16 దేశాలను నమూనాగా తీసుకుని ఈ అధ్యయనం చేశారు కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు. వీరిలో భారత్​కు చెందిన రాజీవ్ చౌదరి కూడా ఉన్నారు.

యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఎమిడెమియాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, కరోనా ప్రభావం ధనిక దేశాల్లో 12 నెలల వరకు, పేద దేశాలపై 18 నెలల వరకు ఉండొచ్చు. ఇప్పుడు తీసుకుంటున్న చర్యలనే కొనసాగిస్తే 16 దేశాల్లో రానున్న మూడు నెలల్లో 7.8 మిలియన్ల మంది కరోనాతో మృతిచెందవచ్చు. అలా కాకుండా 50/30 రోజుల రోలింగ్ లాక్​డౌన్ వ్యూహాన్ని పాటిస్తే ఈ కరోనా మరణాలు 1,30,000కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది.

నిరుద్యోగం, సామాజిక సమస్యలు తప్పవు

లాక్​డౌన్ వ్యూహం అనివార్యం అయినప్పటికీ... దీని వల్ల నిరుద్యోగం సమస్య పెరుగుతుందని, సామాజిక సమస్యలూ తలెత్తే అవకాశముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే దీర్ఘకాలంలో ఈ సమస్యలు తగ్గుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కరోనా ఆర్థిక ప్యాకేజీకి కేబినెట్​ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.