ETV Bharat / bharat

జరిమానాల రూపంలో రైల్వేకు రూ.561 కోట్లు

author img

By

Published : Aug 23, 2020, 4:37 PM IST

Updated : Aug 23, 2020, 4:47 PM IST

2019-20 ఏడాదిలో టికెట్​లేని ప్రయాణికుల ద్వారా సుమారు రూ.561కోట్లు రాబట్టింది రైల్వే విభాగం. కోటి మందికిపైగా ప్రయాణికుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు తెలిపింది.

Rlys earned Rs 561 cr from ticketless travellers in 2019-20, revenue up by 38 pc in last 4 yrs
టికెట్​లేని ప్రయాణికుల ద్వారా రైల్వేశాఖకు రూ.561 కోట్లు

దేశవ్యాప్తంగా టికెట్​ లేకుండా ప్రయాణించేవారి ద్వారా 2019-20లో రూ.561.73 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వేశాఖ తెలిపింది. సుమారు 1.10 కోట్లమంది ప్రయాణికులపై జరిమానాల రూపంలో ఈ మొత్తాన్ని రాబట్టినట్లు వెల్లడించింది. 2018-19 ఏడాదితో పోల్చితే ఇది 6 శాతం అధికమని చెప్పింది. మధ్యప్రదేశ్​కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఈ విషయాలను వెల్లడించింది రైల్వే శాఖ.

నాలుగేళ్లలో 38 శాతానికిపైగా వృద్ధి

టికెట్​​లేని ప్రయాణికుల ద్వారా 2016-20 మధ్యకాలంలో సుమారు రూ.1,938 కోట్ల మేర ఆదాయాన్ని ఆర్జించినట్లు రైల్వేశాఖ పేర్కొంది. 2016-17లో రూ. 405.30 కోట్లు, 2017-18లో రూ. 441.82 కోట్లు, 2018-19లో రూ. 530.06 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు తెలిపింది.

టికెట్​ తీసుకోనివారు ప్రయాణ ఛార్జీలతో పాటు కనీసం రూ.250 జరిమానా చెల్లించాలనే నిబంధన అమలు చేస్తోంది రైల్వే శాఖ.

ఇదీ చదవండి: భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!

Last Updated : Aug 23, 2020, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.