ETV Bharat / bharat

టికెట్​ లేని ప్రయాణం.. రైల్వే శాఖకు తెచ్చింది లాభం! - సమాాచార హక్కు

రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారి నుంచి జరిమానా రూపంలో గత మూడేళ్లలో 1377 కోట్ల రూపాయల వసూలు చేసింది రైల్వే శాఖ. ఈ ఆర్థిక సంవత్సరంలో టికెట్​ లేకుండా ప్రయాణించి దొరికిపోయిన వారి మొత్తం ఇజ్రాయెల్​ జనాభా కంటే అధికమని అధికారులు వెల్లడించారు.

టికెట్​ లేని ప్రయాణం.. రైల్వే శాఖకు తెచ్చింది లాభం!
author img

By

Published : Aug 26, 2019, 5:58 PM IST

Updated : Sep 28, 2019, 8:39 AM IST

గత మూడేళ్ల కాలంలో రైళ్లలో టికెట్​ లేకుండా ప్రయాణం చేసే వారి నుంచి 1377కోట్ల రూపాయలను జరిమానాల రూపంలో వసూలు చేసింది రైల్వే శాఖ. 2016తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు 31 శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్య ప్రదేశ్​కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తును దాఖలు చేశారు. అందుకు రైల్వే అధికారులు బదులిస్తూ... టికెట్ లేకుండా ప్రయాణం చేసేవారిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యల కారణంగా ఇది సాధ్యపడినట్లు తెలిపారు.

గత మూడేళ్లలో వసూలు ఇలా

జరిమానా నుంచి వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 405.30 కోట్లు, 2017-18లో 441.62 కోట్లు, 2018-19లో 530 కోట్ల రూపాయల మేర జరిమానాలు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి పదినెలల కాలంలో టికెట్​ లేకుండా రైళ్లో ప్రయాణిస్తూ సుమారు 89 లక్షల మంది దొరికిపోయారని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఇజ్రాయెల్​ జనాభా కంటే అధికమని వివరించారు.

ఇదీ చూడండి:మన్మోహన్​ సింగ్​కు ఎస్​పీజీ భద్రత తొలగింపు

Intro:Body:Conclusion:
Last Updated : Sep 28, 2019, 8:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.